చికెన్ పకోరా రెసిపీ తయారీ విధానం : స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చికెన్ పకోడీ
భారతీయ వంటకాలు

చికెన్ పకోరా రెసిపీ తయారీ విధానం : స్ట్రీట్ ఫుడ్ స్టైల్ చికెన్ పకోడీ

మంసాహార ప్రియులు అతిగా ఇష్టపడే 'చికెన్ పకోడా' వంటకాన్ని తక్కువ సయమంలో ఇంట్లోనే హాట్ హాట్ గా, స్పైసి స్పైసీగా ఎలా తయారుచేసుకోవచ్చు అలాగే తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం.

చికెన్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • చికెన్ (బోన్‌లెస్) - పావు కిలో
  • అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
  • కారం - ఒక స్పూను
  • పసుపు - అరస్పూను
  • ధనియాల పొడి - అర స్పూను
  • గరం మసాలా - అరస్పూను
  • కార్న్ ఫ్లోర్ - రెండు స్పూనులు
  • పచ్చి మిర్చి పేస్ట్ - ఒక స్పూన్
  • నిమ్మరసం - ఒక స్పూను
  • కరివేపాకు - గుప్పెకు
  • గుడ్డు - ఒకటి
  • పెరుగు - రెండు స్పూనులు
  • కొత్తిమీర - నాలుగు రెమ్మలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - వేయించటానికి సరిపడా

చికెన్ పకోడీ తయారీ విధానం

చికెన్ ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన చికెన్ ముక్కలు ఒక గిన్నెలో వేసి, అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, సరిపడా ఉప్పు మరియు పెరుగు కూడా వేసి మొత్తం కలిసేలా బాగా కలపాలి. కలిపాక ఆ మిశ్రమంలో గుడ్డు కొట్టి వేసి బాగా గిలక్కొట్టాలి.

ఇప్పుడు అందులో పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, నిమ్మరసం కూడా బాగా కలిపాలి. మిశ్రమంలోని ఫ్లేవర్లన్నీ ముక్కకు బాగా పట్టాలంటే గిన్నెపై మూత పెట్టి ఒక ఇరవై నిముషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు చికెన్ చక్కగా మారినేట్ అవుతుంది.

ఈలోపు స్టవ్ వెలిగింది కాస్త లోతుగా ఉండే పాన్ తీసుకుని నూనె వేసి వేడి చేయాలి. లోతుగా ఉండే చిన్న బాణలి పెట్టుకుంటే తక్కువ నూనెతో వేపుడు పూర్తవుతుంది. లేకుంటే ఎక్కువ నూనె ఉపయోగించాలి. నూనె వేడెక్కాక చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తూ వేయించాలి. చికెన్  ముక్కలు ఎర్రగా వేగాక తీసి గిన్నెలో వేసి కొత్తిమీర చల్లుకోవాలి.

చికెన్ పకోడిలో లభించే పోషకాలు

చికెన్‌లో ప్రోటీన్, నియాసిన్, సెలీనియం మరియు ఫాస్పరస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చికెన్ పూర్తి ప్రోటీన్ యొక్క మంచి మూలం, అంటే శరీరం స్వయంగా ఉత్పత్తి చేయలేని మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇవి కండరాల కణజాలాన్ని నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి, అలాగే హార్మోన్ ఉత్పత్తి మరియు కణాల మరమ్మత్తు వంటి ఇతర శారీరక విధుల నిర్వహణకు ప్రోటీన్ ఉపయోగపడుతుంది.

చికెన్ పకోడిలో కొన్ని కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి, కానీ అవి ఎక్కువగా సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లు, ఇవి నెమ్మదిగా జీర్ణమై స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు పేగు ఆరోగ్యానికి కూడా మంచివి.

చికెన్ పకోడీలో కొద్దిమొత్తంలో కొవ్వు ఉంటుంది, అయితే ఇందులో ఎక్కువగా అసంతృప్త కొవ్వు ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అసంతృప్త కొవ్వు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

ఇందులోని బి విటమిన్లు కంటిశుక్లం ఏర్పడకుండా, చర్మ సంబంధిత రుగ్మతలు, శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించడం మరియు జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడతాయి . ఇవి మైగ్రేన్‌లు, గుండె జబ్బులు, జుట్టు నెరసిపోవడం మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

Post Comment