హోటల్ స్టైల్ వంకాయ ఫ్రై తయారీ విధానం : బ్రింజల్ ఫ్రై రెసిపీ
భారతీయ వంటకాలు

హోటల్ స్టైల్ వంకాయ ఫ్రై తయారీ విధానం : బ్రింజల్ ఫ్రై రెసిపీ

ఈ ఆర్టికల్ యందు టేస్టీ టేస్టీగా వంకాయ మరియు బఠానీ కాంబినేషన్లో చేసే వంకాయ ఫ్రై రెసిపీ తయారీ విధానం, కావాల్సిన పదర్ధాలు గూర్చి తెలుసుకుందాం. మీరు నేర్చుకుని ట్రై చేసి రుచి చూడండి.

వంకాయ ఫ్రై చేయటానికి కావాల్సిన పదార్దాలు

  • వంకాయ‌లు - నాలుగు
  • ప‌చ్చి బ‌ఠాణీలు - పావు క‌ప్పు
  • ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు - పావు క‌ప్పు
  • ప‌చ్చిమిర్చి - నాలుగు
  • నూనె - 2  లేదా 3 టేబుల్ స్పూన్స్
  • శ‌న‌గ‌ప‌ప్పు - ఒక టీ స్పూన్
  • మిన‌ప ప‌ప్పు - ఒక టీ స్పూన్
  • జీల‌క‌ర్ర - పావు టీ స్పూన్
  • ఆవాలు - అర టీ స్పూన్
  • ఉల్లిపాయలు - ఒకటి
  • క‌రివేపాకు - రెండు రెమ్మలు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • ప‌సుపు - పావు టీ స్పూన్
  • ఉప్పు – త‌గినంత‌
  • ధ‌నియాల పొడి - ఒక టీ స్పూన్
  • జీల‌క‌ర్ర పొడి - పావు టీ స్పూన్
  • కొత్తిమీర – కొద్దిగా

వంకాయ ఫ్రై తయారీ విధానం

ముందుగా వంకాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. కట్ చేసిన తరవాత ముక్క‌ల‌ను ఉప్పు నీటిలో వేసి ప‌క్క‌నపెట్టుకోవాలి. త‌రువాత ఒక జార్ లో ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ ప‌ట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక క‌ళాయి తీసుకుని నూనె వేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, శెనగపప్పు, మినపప్పు వేసి రెండు నిముషాలు వేయించాలి. ఇవి వేగిన త‌రువాత క‌రివేపాకు, ఉల్లిపాయ ముక్క‌లు వేసి మరో మూడు నిముషాలు వేయించాలి. ఉల్లిపాయలు వేగినతరవాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి. త‌రువాత అందులో ఉప్పు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, ప‌సుపు, గ‌రం మ‌సాలా వేసి రెండు నిమిషాలు పాటు క‌లుపుతూ వేగనివ్వాలి.

రెండు నిమిషాల తరవాత అందులో వంకాయ ముక్క‌లు, ప‌చ్చి బ‌ఠాణీల‌ని వేసి మొత్తం కలిసేలా బాగా కల‌పాలి. కలిపిన తరవాత మూత‌ను ఉంచి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు మ‌ధ్య మ‌ధ్యలో క‌లుపుతూ పది నుంచి పదిహేను నిముషాలు వంకాయముక్కలు మగ్గేవరకు వేయించాలి. వంకాయ ముక్క‌లు వేగిన త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చికొబ్బ‌రి మిశ్ర‌మాన్ని వేసి క‌లపాలి. దీనిని మ‌రో ఐదు నిమిషాల పాటు వేయించి చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

అంతే టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రై రెడీ అయినట్లే. దీనిని అన్నం, చ‌పాతీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే వంకాయ వేపుడు కంటే కూడా ఇలా చేసిన వంకాయ వేపుడు మ‌రింత రుచిగా ఉంటుంది.

వంకాయ ఫ్రైలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

వంకాయ అనేది అధిక ఫైబర్, తక్కువ కేలరీల ఆహారం, ఇది పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది మరియు అనేక సంభావ్య ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అలాగే వంకాయలో రాగి, మాంగనీస్, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి వివిధ ముఖ్యమైన ఖనిజాలు సంవృద్ధిగా ఉన్నాయి, ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం నుండి రక్తంలో చక్కెర నియంత్రణ మరియు బరువు తగ్గడంలో తోడ్పడతాయి.

వంకాయలో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి . వంకాయను వడ్డించడం వల్ల ఒక వ్యక్తికి రోజువారీ అవసరమయ్యే ఫైబర్, రాగి, మాంగనీస్, B-6 మరియు థయామిన్‌లో కనీసం 5% అందించవచ్చు. ఇది ఇతర విటమిన్లు మరియు ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది. అదనంగా, వంకాయలు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే ఫినోలిక్ సమ్మేళనాల మూలం.

దుష్ప్రభావాలు : వంకాయ యొక్క అత్యంత సాధారణ దుష్ప్రభావాలు గొంతు దురద, శరీరం అంతటా చర్మం దద్దుర్లు, అసౌకర్యం మరియు బొంగురుపోవడం (గరుకైన స్వరం) . అటువంటి అలెర్జీ ప్రతిచర్యలు కనిపిస్తే, వెంటనే మీ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించండి.

Post Comment