మటన్ చిల్లీ ఫ్రై రెసిపీని ఎలా తయారు చేయాలి : స్పైసీ మటన్ ఫ్రై
భారతీయ వంటకాలు

మటన్ చిల్లీ ఫ్రై రెసిపీని ఎలా తయారు చేయాలి : స్పైసీ మటన్ ఫ్రై

మంసాహార ప్రియులు అతిగా ఇష్టపడే 'మటన్ చిల్లీ ఫ్రై ' రెసిపీని తక్కువ సయమంలో ఇంట్లోనే టేస్టీగా, స్పైసి స్పైసీగా ఎలా తయారుచేసుకోవచ్చు అలాగే తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం. ఈ రెసిపీ మీరు నేర్చుకుని ట్రై చేయండి.

మటన్ చిల్లీ ఫ్రై తయారీకి కావలసిన పదార్దాలు

  • మటన్ - అరకిలో
  • పండు మిర్చి - ఎనిమిది
  • జీలకర్ర - ఒక టీ స్పూన్
  • ధనియాలు - అర టీ స్పూన్
  • గరం మసాలా - ఒక టీ స్పూను
  • ఉల్లిపాయలు - మీడియం సైజువి రెండు
  • నూనె - సరిపడినంత
  • చింతపండు - రెండు బొట్టలు
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీ స్పూన్లు
  • ఉప్పు - సరిపడా

మటన్ చిల్లీ ఫ్రై తయారీ విదానం

మటన్ శుభ్రంగా కడిగి, మీడియం సైజులో కట్ చేసుకుని కాస్త ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుక్కర్లో 15 నిమిషాల పాటూ ఉడికించాలి. మరోపక్క గరం మసాలా, జీలకర్ర, పండుమిర్చి, ధనియాలు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

ఇప్పుడ స్టవ్ మీద కళాయి పెట్టి సరపడినంత నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్నాగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరవాత అందులో మిక్సీ చేసుకున్న పండుమిర్చి ముద్ద, కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో  ముందుగా ఉడికించిన మటన్ ముక్కల్ని కూడా వేసుకుని, అనంతరం పైన మూత పెట్టి బాగా ఉడికించాలి. నీరంతా ఇంకిపోయాక, ముక్కలు మీరు కోరుకున్నంత డ్రైగా అయ్యాక పైనా కరివేపాకు, కొత్తిమీర చల్లుకుని స్టవ్ కట్టేయాలి. అంతే మటన్ చిల్లీఫ్రై రెడీ అయినట్లే. వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే.

మటన్ చిల్లీ ఫ్రైలో లభించే పోషక విలువలు

మటన్ లో ప్రధానంగా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఐరన్ శరీరంలో రక్త కణాలు మరియు రక్తం ఏర్పడటానికి ఉపయోగించబడుతుంది. ఐరన్ లోపం ఉన్నవారు రెడ్ మీట్, ముఖ్యంగా మటన్ తినమని సలహా ఇవ్వడానికి ఇది ఒక కారణం. ఐరన్ లో ఉండే జింక్ శరీరం యొక్క సహజ రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది; ఇది గోర్లు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

మటన్‌లోని ఐరన్, జింక్ మరియు విటమిన్ బి12 రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. గాయం నయం చేయడానికి జింక్ అవసరం, కాబట్టి మటన్ తినడం వల్ల వైద్యం ప్రక్రియ వేగవంతం అవుతుంది. మటన్‌లోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ట్రైగ్లిజరైడ్స్ మరియు రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మటన్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మంటను తగ్గించడం మరియు అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడం ద్వారా మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి.

గమనిక : మటన్, గొర్రె లేదా ఇతర రకాల మాంసం వంటి రెడ్ మీట్ ఫుడ్ ఐటమ్స్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి . వేసవిలో, ఈ మాంసాలు మరియు ఆహారాల వినియోగాన్ని తగ్గించండి.

Post Comment