చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం : హైదరాబాదీ స్పెషల్
భారతీయ వంటకాలు

చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం : హైదరాబాదీ స్పెషల్

నాన్ వెజ్ ప్రియులు అతిగా ఇష్టపడే 'చికెన్ దమ్ బిర్యానీ' రెసిపీని తక్కువ సయమంలో ఇంట్లోనే టేస్టీగా, స్పైసి స్పైసీగా ఎలా తయారుచేసుకోవచ్చు అలాగే చికెన్ దమ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం. ఈ రెసిపీ మీరు నేర్చుకుని ట్రై చేయండి.

చికెన్ దమ్ బిర్యానీ తయారీకి కావలిసిన పదార్దాలు

  • చికెన్ - అర కేజీ
  • బాస్మతీ బియ్యం - రెండు కప్పులు
  • ఉల్లిపాయలు - నాలుగు
  • పెరుగు - ఒక కప్పు
  • పచ్చిమిర్చి - నాలుగు
  • పసుపు - 1/4 టీస్పూన్
  • కారం పొడి - 1 టీస్పూన్
  • అల్లం-వెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్స్
  • లవంగాలు - ఆరు
  • యాలకులు - మూడు
  • బిర్యానీ ఆకులు - రెండు
  • దాల్చినచెక్క - చిన్న ముక్క
  • షాజీరా - ఒక స్పూన్
  • ఎండు గులాబీ రేకులు - 3 టీస్పూన్స్
  • పాలు - 1/2 కప్పు
  • ఉప్పు - తగినంత
  • నూనె - సరిపడా
  • గరంమసాలా పొడి - 1 టీస్పూన్
  • నిమ్మరసం - 1 టీస్పూన్
  • కుంకుమ పువ్వు - చిటికెడు
  • కొత్తిమీర - అర కట్ట
  • పుదీనా - పావు కట్ట

చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయు విధానం

ముందుగా పాన్‌లో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా కరకరలాడేటట్టుగా వేయించి పెట్టుకోవాలి. అలాగే తరిగిన కొత్తిమీర, పుదీనా, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కూడా వేయిచుకోవాలి. కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కారంపొడి, పసుపు, నిమ్మరసం, ఎండిన గులాబీ రేకులు, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా ముద్ద చేసుకోవాలి.

తరవాత ఒక గిన్నెలో చికెన్ వేసి, అందులో మిక్సీపట్టిన ముద్ద, పచ్చి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, గరంమసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంట నాననివ్వాలి. బియ్యం శుభ్రంగా కడిగి అరగంట నాననివ్వాలి. తరువాత స్టవ్ వెలిగించుకుని మందపాటి గిన్నె తీసుకుని నూనె వేయాలి. నూనె  వేడయ్యాక దానిలో నానబెట్టిన చికెన్ వేసి ఉడకనివ్వాలి. ఇంకో గిన్నెలో బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసి మరగించాలి.

నీరు మరిగేటప్పుడు ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా వేయాలి. మరుగుతున్న నీటిలో నానపెట్టిన బియ్యం వేసి సగం ఉడకగానే జల్లెడలో వడకట్టి ఉడుకుతున్న చికెన్ పై సమానంగా పరవాలి. దానిపై ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా నూనె, సన్నగా తరిగిన కొత్తిమీర, యాలకుల పొడి, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు అక్కడక్కడ వేసి, గిన్నెపై బరువైన మూత పెట్టాలి.

మూత చుట్టూ ఆవిరి బయటకు పోకుండా తడిపిన గోధుమ పిండిని పెట్టాలి. అరగంట సన్నని మంట మీద ఉడకనివ్వాలి. బిర్యానీ మొత్తం ఆవిరి మీదే ఉడికిపోతుంది. అంతే యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయినట్లే.

చికెన్ దమ్ బిర్యానీ తయారీకి చిట్కాలు

చికెన్‌ను కనీసం 30 నిమిషాలు మెరినేట్ చేయండి. ఇది చికెన్‌ను మృదువుగా చేయడానికి మరియు రుచి నింపడానికి సహాయపడుతుంది. అలాగే బియ్యం కూడా ముప్పై నిముషాలు నానబెట్టుకోవాలి. బియ్యం మరియు చికెన్ వండేటప్పుడు మొత్తం మసాలా దినుసులను ఉపయోగించండి. మొత్తం మసాలాలు మీ బిర్యానీకి గ్రౌండ్ మసాలాల కంటే ఎక్కువ రుచిని జోడిస్తాయి.

అన్నం మరియు చికెన్ విడివిడిగా ఉడికించాలి. ఇది బియ్యం మెత్తగా మారకుండా మరియు చికెన్ ఎక్కువగా ఉడకకుండా సహాయపడుతుంది. బిర్యానీ వండడానికి బరువైన అడుగున ఉన్న కుండను ఉపయోగించండి. ఇది వేడిని సమానంగా పంపిణీ చేయడానికి మరియు బిర్యానీ మాడిపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

చికెన్ దమ్ బిర్యానీలో లభించే పోషక విలువలు

చికెన్ దమ్ బిర్యానీలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఇనుము, మెగ్నీషియం మరియు జింక్‌తో సహా అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది. చికెన్ దమ్ బిర్యానీలోని మసాలాలు జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి.

చికెన్ లీన్ ప్రోటీన్ యొక్క మంచి మూలం, ఇది కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడానికి అవసరం. అన్నంలో కార్బోహైడ్రేట్ల సంవృద్ధిగా లభిస్తాయి, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. చికెన్ దమ్ బిర్యానీలో వంటలో ఉపయోగించే నూనె, అలాగే గింజలు మరియు నెయ్యి నుండి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. చికెన్ దమ్ బిర్యానీ విటమిన్ B6, ఐరన్, మెగ్నీషియం మరియు జింక్‌తో సహా విటమిన్లు మరియు ఖనిజాలకు మంచి మూలం.

Post Comment