బటర్ చికెన్ కర్రీ తయారీ విధానం : చికెన్ బటర్ మసాలా రెసిపీ
భారతీయ వంటకాలు

బటర్ చికెన్ కర్రీ తయారీ విధానం : చికెన్ బటర్ మసాలా రెసిపీ

నాన్ వెజ్ ప్రియులు అతిగా ఇష్టపడే 'బటర్ చికెన్' రెసిపీని తక్కువ సయమంలో ఇంట్లోనే టేస్టీ టేస్టీగా ఎలా తయారుచేసుకోవచ్చు అలాగే బటర్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్దాలు ఏమిటో ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం. ఈ రెసిపీ మీరు నేర్చుకుని ఒక్కసారి ట్రై చేయండి.

బటర్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • చికెన్ - అర కిలో
  • పెరుగు - రెండు టేబుల్ స్పూన్స్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటి టేబుల్ స్పూన్
  • పసుపు పొడి - టీ టీస్పూన్
  • కారం - రెండు టీస్పూన్లు
  • జీలకర్ర పొడి - టీ టీస్పూన్
  • గరం మసాలా - టీ టీస్పూన్
  • నిమ్మరసం - టీ టేబుల్ స్పూన్
  • ఉప్పు - తగినంత
  • నూనె - రెండు టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
  • దాల్చిన చెక్క - ఒక చిన్న ముక్క
  • యాలకులు - రెండు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి - రెండు (తురిమినవి)
  • టొమాటోలు - ఆరు
  • ఉల్లి - ఒకటి
  • జీడిపప్పు - 20 (నీళ్లలో నానబెట్టి పేస్ట్ చేయాలి)
  • వెన్న - మూడు టేబుల్ స్పూన్లు
  • మీగడ - పావు కప్పు
  • కొత్తిమీర - కొద్దిగా

బటర్ చికెన్ తయారీ విధానం

ముందుగా చికెన్‌ని బాగా కడగాలి. తర్వాత కడిగిన చికెన్‌ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపి గంటపాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. టమాటాలు, ఉలిపాయలు పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి. జీడీ పప్పు కూడా నానబెట్టి పేస్ట్ లా చేసుకోవాలి.

చికెన్ నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో నానబెట్టిన చికెన్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.తర్వాత అదే పాన్‌లో సరిపడా నూనె పోసి వేడి అయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు వేసి దోరగా వేయించాలి.

తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి బాగా వేగించాలి. ఇప్పుడు ముందుగా రుబ్బిన టొమాటో, ఉల్లి పేస్ట్ వేసి కలుపుతూ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత కారం, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో జీడిపప్పు పేస్ట్ వేసి చిన్న మంట మీద ఉంచి 10 నిమిషాలు ఉడకనివ్వాలి.

ఆ తర్వాత గ్రేవీకి కావల్సినంత నీరు పోసి కలుపుతూ ఉండాలి. చికెన్ ముక్కలు వేసి, తక్కువ మంట మీద ఉంచి చికెన్‌ను 10-15 నిమిషాలు ఉడికించాలి. చివరగా మెంతి వేసుకుని, గరం మసాలా వేసి కలపాలి. పైన బటర్, మిల్క్ క్రీమ్ వేసి కొత్తిమీర చల్లితే రుచికరమైన బటర్ చికెన్ రెడీ.

బటర్ చికెన్ తయారీలో లభించే పోషకాలు

బటర్ చికెన్‌లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది . ప్రోటీన్స్ కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మత్తు చేయడానికి, కండర ద్రవ్యరాశిని నిర్వహించడానికి మరియు వివిధ శారీరక విధులకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అల్లం, వెల్లుల్లి, పసుపు మరియు జీలకర్ర వంటి బటర్ చికెన్‌లో ఉపయోగించే మసాలా దినుసులు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో మరియు గట్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

బటర్ చికెన్‌లో తక్కువ మొత్తంలో కాల్షియం మరియు విటమిన్ డి ఉంటాయి, ఎముకల ఆరోగ్యానికి మరియు బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. బటర్ చికెన్‌లో విటమిన్ సి కూడా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది, ఇది శరీరానికి ఇన్ఫెక్షన్లు మరియు అనారోగ్యాలతో పోరాడటానికి సహాయపడుతుంది.

కొన్ని అధ్యయనాలు బటర్ చికెన్‌లోని యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మంటను తగ్గించడం మరియు ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడం ద్వారా గుండె-ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. బటర్ చికెన్‌లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల కలయిక సంతృప్తికరమైన మరియు శక్తినిచ్చే భోజనంగా చేస్తుంది, ఇది మిమ్మల్ని గంటల తరబడి నిండుగా మరియు శక్తివంతంగా ఉంచుతుంది.

Post Comment