పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం : పనీర్ ఫ్రైడ్ రైస్ రిసిపి
భారతీయ వంటకాలు

పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం : పనీర్ ఫ్రైడ్ రైస్ రిసిపి

రైస్ కాంబినేషన్లో చేసే ప్రతీ రెసిపీకి ఒక ప్రత్యేక ఉంటుంది. ఈ ఆర్టికల్ యందు పన్నీర్ మరియు రైస్ కాంబినేషన్లో చేసే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలి, తయారీకి కావాల్సిన పదార్ధాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. పన్నీర్ ఫ్రైడ్ రైస్ లో పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి, మీరు కూడా నేర్చుకుని ట్రై చేయండి.

పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావలిసిన పదార్ధాలు

  • బాస్మతీ బియ్యం - రెండు కప్పులు
  • పన్నీర్ - రెండు కప్పులు
  • క్యాప్సికమ్ - ఒకటి
  • క్యారెట్ - ఒకటి
  • బీన్స్ - పావుకప్పు
  • ఉల్లిపాయలు - రెండు
  • తరిగిన వెల్లుల్లి - 1 చెంచా
  • నూనె - మూడు టేబుల్ స్పూన్స్
  • నెయ్యి - ఒక టేబుల్ స్పూన్స్
  • కారం - ఒక స్పూన్ (సరిపడా)
  • సోయా సాస్ - రెండు స్పూన్స్
  • చిల్లీ సాస్ - రెండు స్పూన్స్
  • మిరియాల పొడి - 1 చెంచా
  • ధనియాల పొడి - ఒక స్పూన్
  • ఉప్పు - తగినంత

పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం

బాస్మతీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అన్నం కొంచెం పలుకుగా వండి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి పన్నీర్ ను దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పడు అదే పాన్‌లో నూనె వేసి, వేడయ్యాక వెల్లుల్లి తురుము వేసి ఒక నిమిషం వేయించాలి.

నిమిషం తర్వాత దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్, బీన్స్, చిన్నాగా తిరిగిన క్యారెట్ ముక్కలు వేయాలి. ముక్కలు మెత్తబడేవరకూ వేయించి పన్నీర్ తురుము వేసి బాగా కలిపి. సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు వేయించాక, అందుల చిల్లీ సాస్, సోయా సాస్, సరిపడా ఉప్పు వేసి మరో నిమిషం పాటు వేయించాలి.

అనంతరం ముందుగా వండుకున్న అన్నం వేసి రెండు నిముషాలు కలుపుతూ వేగనివ్వాలి. ఆ తరువాత మిరియాల పొడి, ధనియాల పొడి వేయాలి. అన్నిటినీ బాగా కలుపుతూ ఓ ఐదు నిమిషాల పాటు వేయించాలి. అంతే టేస్టీ టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే. చివరిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది.

పన్నీర్ ఫ్రైడ్ రైస్‌లో లభించే పోషకాలు

పనీర్ ప్రోటీన్ యొక్క మంచి మూలం, ప్రోటీన్స్ కండరాల కణజాల నిర్మాణానికి మరియు మరమ్మత్తుకు ఉపయోగపడుతుంది. ఇది సంతృప్తిని ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది, ఇది మీ బరువును నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. పనీర్ ఫ్రైడ్ రైస్‌లోని కూరగాయలు ఫైబర్ యొక్క మంచి మూలం, ఫైబర్ జీర్ణ క్రియ మెరుగుపర్చటానికి ముఖ్యమైనది. ఫైబర్ కూడా సంతృప్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

పనీర్ ఫ్రైడ్ రైస్ లో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ కె లు సంవృద్ధిగా లభిస్తాయి. దృష్టి మరియు రోగనిరోధక పనితీరుకు విటమిన్ ఎ ముఖ్యమైనది. విటమిన్ సి అనేది యాంటీఆక్సిడెంట్, ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్తం గడ్డకట్టడానికి విటమిన్ కె ముఖ్యమైనది. తక్కువ పనీర్ ఫ్రైడ్ రైస్ సాపేక్షంగా తక్కువ కేలరీల వంటకం, వారి బరువును తగ్గాలనుకునే వ్యక్తులకు ఇది మంచి ఎంపిక.

పనీర్ ఫ్రైడ్ రైస్ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆరోగ్యకరమైన మరియు పోషకమైన వంటకం. ఇది ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలకు మంచి మూలం . ఇది కేలరీలలో కూడా తక్కువగా ఉంటుంది మరియు శక్తి స్థాయిలను పెంచడానికి, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి మరియు ఎముక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

Post Comment