ఆలూ మంచూరియా తయారుచేసే విధానం : పొటాటో మంచూరియా
భారతీయ వంటకాలు

ఆలూ మంచూరియా తయారుచేసే విధానం : పొటాటో మంచూరియా

ఈ ఆర్టికల్ యందు ఇంట్లోనే ఈజీగా మరియు చాలా తక్కువ సమయంలో ఆలూ మంచూరియా రెసిపీని ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్దాలు ఏమిటి అన్ని వివరాలు తెలుసుకుందాం .

ఆలూ మంచూరియా తయారీకి కావలిసిన పదార్దాలు

  • బేబీ బంగాళాదుంపలు - 14
  • ఉల్లిపాయలు - రెండు
  • కార్న్ ఫ్లోర్ - మూడు టేబుల్ స్పూన్స్
  • మైదా - రెండు టేబుల్ స్పూన్స్
  • మిరియాల పొడి- అర టీ స్పూన్
  • ధనియాల పొడి - అర టీ స్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
  • కారం- ఒక టీస్పూన్
  • పసుపు - అర టీ స్పూన్
  • ఉప్పు- రుచికి సరిపడా
  • సోయా సాస్- 1 టేబుల్ స్పూన్
  • టమాటో సాస్ -ఒక టేబుల్ స్పూన్
  • చిల్లీసాస్ - ఒక టేబుల్ స్పూన్
  • పచ్చి మిర్చి - రెండు
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • నూనె - వేయించటానికి సరిపడా

ఆలూ మంచూరియా తయారుచేసే విధానం

ముందుగా బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి పేస్ట్‌లా చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్‌లో వేయించటానికి సరిపడా నూనె వేసుకోవాలి.

నూనె వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ మిశ్రమంలో బంగాళాదుంపలు ఒక్కొక్కటిగా ముంచి వేసుకోవాలి. బంగాళాదుంపలు ఎరుపు రంగులో వేగిన తరవాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్‌లో టేబుల్ స్పూన్ నూనె వేసి కాగాక సన్నగా తరిగిన ఉల్లి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి.

వేగిన తరవాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, మిరియాలపొడి, గరంమసాలా పొడి, ధనియాలపొడి, కొద్దిగా పసుపు, సరిపడా కారం, తగినంత ఉప్పు వేసి, పచ్చి వాసన పోయేలా మరి కొద్దిసేపు వేయించాలి. వేగిన తరవాత సోయా సాస్, టమాటో సాస్, చిల్లి సాస్ వేసి మొత్తం కలిసేలా కలిపి, అందులో ముందుగా వేయించుకున్న బంగాళాదుంపలు వేసి ఐదు నిముషాలు కలుపుతూ వేయించుకోవాలి. అంతే చివర్లో కొత్తిమీర, నిమ్మరసం వేసుకుని సర్వ్ చేసుకోవటమే.

ఆలూ మంచూరియాలో లభించే పోషకాలు

బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్ల అధికంగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ శక్తి ఉత్పత్తికి అవసరం. ఆలూ ఫైబర్ యొక్క మంచి మూలం, ఇది జీర్ణక్రియ మెరుగుపరచటంలో సహాయపడుతుంది. ఆలూ మంచూరియాలో విటమిన్లు మరియు ఖనిజాలు సంవృద్ధిగా ఉంటాయి. బంగాళదుంపలు విటమిన్ సి, బి6 మరియు పొటాషియం యొక్క మంచి మూలం .

బంగాళదుంప మంచూరియాలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి అనేది యాంటీఆక్సిడెంట్, ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి కూడా ముఖ్యమైనది, ఇది సంక్రమణతో పోరాడటానికి అవసరమైనది.

బంగాళదుంప మంచూరియాలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పొటాషియం అనేది శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేయడానికి సహాయపడే ఎలక్ట్రోలైట్. ఇది రక్త నాళాలను విశ్రాంతి తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

బంగాళాదుంప మంచూరియాలోని ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను కదలకుండా ఉంచడంలో సహాయపడుతుంది మరియు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇది గట్‌లోని మంచి బ్యాక్టీరియాను పోషించడంలో సహాయపడుతుంది, ఇది మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైనది.

Post Comment