ఆలూ కుర్మా రెసిపీ : ఆలూ టొమాటో కుర్మా తయారీ విధానం
భారతీయ వంటకాలు

ఆలూ కుర్మా రెసిపీ : ఆలూ టొమాటో కుర్మా తయారీ విధానం

రోజూ ఇంట్లో ఒకే రకమైన వంటలు అని, ఏదైనా కొత్తగా నేర్చుకుని ట్రై చేయాలనిపిస్తుందా.. అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీ కోసమే. ఈ ఆర్టికల్ యందు అదిరిపోయే ఆలూ కుర్మా రెసిపీ ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకోండి.

ఆలూ కుర్మా తయారీకి కావాల్సిన పదార్దాలు

  • బంగాళదుంపలు - నాలుగు
  • ఉల్లి పాయలు - రెండు
  • టమాటోలు - రెండు
  • పచ్చి కొబ్బరి - నాలుగు చెంచాలు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
  • ధనియాలు - రెండు చెంచాలు
  • జీలకర్ర - ఒక చెంచా
  • నూనె - రెండు చెంచాలు
  • ఆవాలు - అర చెంచా
  • జీలకర్ర - పావు చెంచా
  • ఉప్పు - తగినంత
  • కారం - తగినంత
  • పసుపు - తగినంత
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • కొత్తిమీర - రెండు రెమ్మలు

ఆలూ కుర్మా తయారీ విధానం

ముందుగా బంగాళాదుంపలు ఉడకబెట్టుకుని పొట్టును తీసి ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీరా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత దీనిలోనే తగినంత ఉప్పు, ప‌సుపు, అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత సరిపడ కారం, ధ‌నియాల పొడి,గరం మసాలా వేసి కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత పచ్చి కొబ్బరి తురుము వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు, టమోటా గుజ్జు వేసి క‌లపాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు తక్కువ మంటపై మగ్గనివ్వాలి.

ఐదునిమిషాలు తర్వాత నీళ్లు పోసి మూత పెట్టి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. యమ్మీ యమ్మీ ఆలూ కుర్మా రెడీ అయినట్లే. దీనిని చ‌పాతీ, పుల్కా, రోటి వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రెగ్యులర్ చేసే బంగాళాదుంప కూర కంటే ఇలా చేసిన ఆలూ కుర్మా మ‌రింత రుచిగా ఉంటుంది.

ఆలూ కుర్మాలో లభించే పోషక విలువలు

ఇది యాంటీఆక్సిడెంట్ . విటమిన్ సి స్కర్వీని నివారిస్తుంది కాబట్టి బంగాళాదుంపలు ప్రారంభ కాలంలో ప్రాణాలను రక్షించే ఆహార వనరు. బంగాళాదుంపలలోని మరొక ప్రధాన పోషకం పొటాషియం, ఇది మన గుండె, కండరాలు మరియు నాడీ వ్యవస్థ యొక్క పనితీరులో సహాయపడే ఎలక్ట్రోలైట్.

బంగాళాదుంపలను రోజూ తినడం వల్ల కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు మరియు మినరల్స్ వంటి పోషకాహార భాగాల వల్ల పోషకాహార లోపానికి సహాయపడవచ్చు.బంగాళాదుంపలలో తక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. 180 గ్రా ఉడికించిన మీడియం భాగంలో సుమారు 3 గ్రా.. ఇది రోజువారీ వయోజన అవసరాలలో 10% కంటే తక్కువగా ఉన్నప్పటికీ, బంగాళాదుంపలు అమైనో ఆమ్లాలు లైసిన్ మరియు ట్రిప్టోఫాన్‌లకు మంచి మూలం మరియు పాలు లేదా గుడ్లతో కలిపి అధిక నాణ్యత గల ప్రోటీన్ ఆహారాన్ని అందిస్తాయి.

Post Comment