వాము అన్నం తయారు చేయటం ఎలా : వాము రైస్ రెసిపీ
భారతీయ వంటకాలు

వాము అన్నం తయారు చేయటం ఎలా : వాము రైస్ రెసిపీ

రైస్ కాంబినేషన్లో చేసే ప్రతీ రెసిపీకి ఒక ప్రత్యేక రుచి ఉంటుంది. ఈ ఆర్టికల్ యందు వాము మరియు రైస్ కాంబినేషన్లో చేసే వాము అన్నం రెసిపీ ఎలా తయారు చేయాలి, తయారీకి కావాల్సిన పదార్ధాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. వాము రైస్ లో పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి మరియు చాలా ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు కూడా నేర్చుకుని ఒక్కసారి ట్రై చేయండి.

వాము అన్నం తయారీకి కావాల్సిన పదార్దాలు

  • వండిన అన్నం - రెండు కప్పులు
  • వాము - రెండు టీ స్పూన్స్
  • ఎండు మిర్చి - నాలుగు
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • జీలకర్ర - ఒక టీ స్పూన్
  • వెల్లుల్లిరెబ్బలు - ఆరు
  • పసుపు - అర టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - రెండు లేదా టీ స్పూన్లు

వాము అన్నం తయారుచేసే విధానం

ముందుగా ఉడికించిన రైస్ తీసుకోవాలి. రైస్ చల్లగా అయ్యాక అందులో ఉప్పు, ప‌సుపు వేసి క‌లిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి క‌ళాయిలో నూనె వేసుకోవాలి. నూనె కాగిన త‌రువాత ఎండు మిర్చిని వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన త‌రువాత అందులో వాము, జీల‌క‌ర్ర వేసి మరో నిమిషం పాటూ వేయించుకోవాలి.

త‌రువాత అందులో వెల్లుల్లి రెబ్బలు, క‌రివేపాకును వేసి మూడు నుంచి ఐదు నిముషాలు వేయించుకోవాలి. అనంతరం అందులో ముందుగా ప‌సుపు, ఉప్పు క‌లిపి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం వేసుక ఉప్పు సరిచూసుకుని మొత్తం కలిసేలా బాగా క‌లిపి మూడు నిమిషాల పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

అంతే వేడివేడిగా వాము అన్నం రెడీ అయినట్లే. మీరు కూడా నేర్చుకుని వారం కి ఒక్కసారైనా మీ ఇంట్లోవాళ్ళకి రుచి చూపించండి. వాము అన్నం ఆరోగ్యానికి చాలా మంచిది.

వాము అన్నం తయారీకి కొన్ని చిట్కాలు

వాము అన్నం కోసం రైస్ కొంచెం పలుకుగా వండుకోవాలి. రైస్ చల్లగా అయిన తరవాత పోపులో  కలుపుకోవాలి. వాము అన్నంలో ఎండుమిర్చిని మాత్రమే ఉపయోగించండి. ఎందుకంటే వాము స్పైసీగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి వేస్తే ఇంకొంచెం ఎక్కువ స్పైసి అవుతుంది. వాము అన్నం మరింత కావాలనుకుంటే వెల్లుల్లితో పాటూ ఎర్ర ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. అలాగే అల్లం కూడా చిన్నగా తరిగివేసుకోవచ్చు. వాము అన్నంరుచికి పోపు ప్రదానం కాబట్టి పోపును సరిగ్గా వేగనివ్వాలి.

వాము అన్నంలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

వాములో నియాసిన్, థయామిన్, సోడియం, ఫాస్పరస్, పొటాషియం మరియు కాల్షియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉన్నాయి . అలాగే ఇందులో కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్స్, ప్రోటీన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

వాము తీసుకోవటం వలన అపానవాయువు, అజీర్ణం, పాలీయూరియా, ఉబ్బసం, బ్రోన్కైటిస్, సాధారణ జలుబు, పంటి నొప్పి, వివిధ ఇతర జీర్ణశయాంతర రుగ్మతలు, కార్డియాల్జియా, చెవినొప్పి అలాగే గొంతులో నొప్పి, కీళ్లనొప్పులు మరియు రుమాటిక్ నొప్పులు మరియు మైగ్రేన్. ఇది కామోద్దీపనగా కూడా ఉపయోగించబడుతుంది.

పచ్చి వామును ఉదయం పూట నమలడం వల్ల మీరు చాలా బరువు తగ్గవచ్చు. మీరు అల్పాహారానికి 30 నిమిషాల ముందు క్యారమ్ సీడ్స్ తీసుకోవచ్చు. ఇది మీ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది మరియు మీరు దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే, మీరు ఒక నెలలో 2-3 కిలోల బరువు తగ్గవచ్చు. వాము శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

Post Comment