వెజిటబుల్ సేమియా ఉప్మా తయారీ విధానం : టేస్టీ బ్రేక్ పాస్ట్ రెసిపీ
భారతీయ వంటకాలు

వెజిటబుల్ సేమియా ఉప్మా తయారీ విధానం : టేస్టీ బ్రేక్ పాస్ట్ రెసిపీ

బ్రేక్ ఫాస్ట్ రెసిపీస్ లలో చాలా రకాల వంటకాలు ఉన్నాయి. అందులో తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకునే వెజిటబుల్ సేమియా ఉప్మా రెసిపీ తయారీ గూర్చి ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం.

సేమియా ఉప్మా తయారీకి కావాల్సిన పదర్ధాలు

  • సేమియా - రెండు కప్పులు
  • ఉల్లిపాయలు - రెండు
  • గ్రీన్ పీస్ - పావు కప్పు
  • క్యారెట్ - ఒకటి
  • టమాటో - ఒకటి
  • పచ్చి మిర్చి - రెండు
  • పసుపు - 1/4 టీస్పూన్
  • ఆవాలు - 1/4 టీ స్పూన్
  • శెనగపప్పు - ఒక టీ స్పూన్
  • వేరుశెనగ పలుకులు - ఒక టీ స్పూన్
  • జీడిపప్పు - ఆరు పలుకులు
  • మినపప్పు - ఒక టీ స్పూన్
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • ఎండుమిర్చి - రెండు
  • ఉప్పు - సరిపడా
  • నూనె - సరిపడా
  • నీరు - మూడు కప్పులు

సేమియా ఉప్మా తయారు చేసే విధానం

ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, పాన్ వేడి చేసి అందులో నూనె వేసి లైట్ గా కాగిన తర్వాత అందులో సేమియా వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. వేగిన తర్వాత సేమియాను వేరే ప్లేట్ లోనికి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి.

తర్వాత  అదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, ఎండుమిర్చి , మినపప్పు, శెనగపప్పు, వేరుశెనగ పలుకులు కరివేపాకు వేసి ఒక నిముషం వేగించుకోవాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయలు కూడా వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.

తర్వాత అందులో కొద్దిగా పసుపు, క్యారెట్, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి, జీడిపప్పు మరియు టమోటో ముక్కలు కూడా వేసి మరో 5-6నిముషాలు వేగించుకోవాలి. మొత్తం మిశ్రమం వేగిన తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసుకుని, సరిపడా ఉప్పు, మరియు నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి ఉడికించుకోవాలి.

నీరు మొత్తం పూర్తిగా ఇగిరిపోయే వరకూ సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక సారి నీరు మొత్తం డ్రై అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి అంతే టేస్టీ అండ్ ఈజీ సేమియా ఉప్మా రెడీ. ఈ ఉప్మా రిసిపిని కొబ్బరి చట్నీతో ఎంజాయ్ చేయవచ్చు.

సేమియా ఉప్మాలో పోషక విలువలు

వెజిటబుల్ సేమియా ఉప్మాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. వెజిటబుల్ సెమీయా ఉప్మాలో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్ కండరాల నిర్మాణానికి మరియు మరమ్మతు కోసం అవసరం.

వెజిటబుల్ సెమీయా ఉప్మాలో కొవ్వుపదార్ధాలు తక్కువ మోతాదులో ఉంటాయి. కొవ్వు శరీరానికి శక్తిని అందిస్తుంది మరియు కణాలను రక్షిస్తుంది. వెజిటబుల్ సెమీయా ఉప్మాలో కేలరీలు స్వల్పంగా ఉంటాయి. కాబట్టి, ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి మంచి ఆహారం.

Post Comment