పెరుగు అన్నం ఎలా తయారు చేయాలి : దద్దోజనం తయారీ విధానం
భారతీయ వంటకాలు

పెరుగు అన్నం ఎలా తయారు చేయాలి : దద్దోజనం తయారీ విధానం

రైస్ కాంబినేషన్లో చేసే ఏ వంటకం అయినా ఒక ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. ఈ ఆర్టికల్ యందు పెరుగు మరియు రైస్ కాంబినేషన్లో చేసే కర్డ్ రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్ధాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇందులో ప్రోటీన్, కాల్షియం మరియు విటమిన్ బి12 వంటివి పుష్కలంగా కలిగి ఉన్నాయి. పెరుగు ప్రొబయోటిక్స్‌తో సమృద్ధిగా ఉంటుంది, ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడంలో మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి.

పెరుగు అన్నం తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • రైస్ - మూడు కప్పులు
  • పెరుగు - రెండు కప్పులు
  • ఉల్లిపాయ - ఒకటి
  • మిరియాలు - ఆరు
  • క్యారెట్ - ఒకటి (చిన్నది)
  • ఆవాలు - అర టీ స్పూన్ స్పూన్
  • శెనగపప్పు - ఒక స్పూన్
  • మినప్పప్పు - ఒక స్పూన్
  • ఎండు మిర్చి - రెండు
  • పచ్చి మిర్చి - ఒకటి
  • కరివేపాకు - నాలుగు రెమ్మలు
  • నూనె - రెండు టేబుల్ స్పూన్స్
  • ఇంగువ - చిటికెడు
  • అల్లం తురుము - అర టీ స్పూన్
  • జీడీ పప్పు - తగినన్ని
  • కొత్తిమీర - రెండు రెమ్మలు

పెరుగు అన్నం తయారు చేయు విధానం

ముందుగా రైస్ శుభ్రంగా కడగాలి. తరవాత అన్నం కొంచెం ఉడికించి పక్కన పెట్టి కొద్దిగా చల్లార్చుకోవాలి. అన్నం కొద్దిగా చల్లగా అయిన తరవాత అన్నంలో పెరుగు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి తురుము, అల్లం తురుము, సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి.

ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ తీసుకుని నూనె వేసి, వేడయ్యాక అందులో ఆవాలు, మినపప్పు, శెనగపప్పు, మిరియాలు, ఇంగువ, ఎండు మిర్చి, కరివేపాకు, క్యారెట్ తురుము వేసి బాగా వేయించాలి. ఇలా వేగిన పోపుని ముందుగా కలుపుకున్న అన్నం మిశ్రమంలో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చివరిగా కొత్తిమీర, జీడీ పప్పు వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమే.

పెరుగు అన్నంలో లభించే పోషకాలు

ఇందులో అధిక ప్రోటీన్, తక్కువ పిండి పదార్థాలు, విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి.  పెరుగులో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ప్రొటీన్ కండరాల కణజాలాన్ని నిర్మించటానికి మరియు మరమత్తు చేయటానికి ఉపయోగపడుతుంది. ఇది మంచి యాంటీఆక్సిడెంట్ మరియు కాల్షియం యొక్క అధిక కంటెంట్లను కలిగి ఉంటుంది. బియ్యం మెగ్నీషియం మరియు పొటాషియం యొక్క మంచి మూలం.

పెరుగు కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తుంది మరియు తద్వారా అధిక రక్తపోటు మరియు రక్తపోటును నివారిస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉన్నాయి, ఇవి కడుపులో గ్యాస్ మరియు ఉబ్బరాన్ని తగ్గించే మంచి బ్యాక్టీరియా, అలాగే పొటాషియం, ఇది శరీరం సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది.

పెరుగులో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు ఉన్నాయి, ఇవి జీర్ణశయాంతర జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు ఉబ్బరం తగ్గిస్తాయి. రోజూ పెరుగు అన్నం తీసుకోవడం వల్ల వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది మరియు మీ జీర్ణవ్యవస్థ మరియు ప్రేగులను సురక్షితంగా ఉంచుతుంది. పెరుగు అన్నం మనలో చాలా మందికి సౌకర్యవంతమైన ఆహారం. ఇది ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైబర్‌లో సమృద్ధిగా ఉంటుంది.

Post Comment