పచ్చి బఠాణి పులావ్ తయారీ విధానం : గ్రీన్ పీస్ పులావ్ రెసిపీ
భారతీయ వంటకాలు

పచ్చి బఠాణి పులావ్ తయారీ విధానం : గ్రీన్ పీస్ పులావ్ రెసిపీ

రైస్ కాంబినేషన్లో చేసే ఏ వంటకం అయినా రుచికి అద్భుతంగా ఉంటాయి. ఈ ఆర్టికల్ యందు ఎంచక్కా ఇంట్లోనే పచ్చి బఠాణి మరియు రైస్ కాంబినేషన్లో చేసే పచ్చి బఠాణి పులావ్ రెసిపీ ఎలా తయారు చేయాలి, పులావ్ తయారీకి కావాల్సిన పదార్ధాలు ఇక్కడ తెలుసుకుందాం.

పచ్చి బఠాణి పులావ్ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • బాస్మ‌తీ బియ్యం – రెండు గ్లాసులు
  • నీళ్లు – నాలుగు గ్లాసులు
  • నెయ్యి – రెండు స్పూన్స్
  • నూనె – రెండు స్పూన్స్
  • జీడిప‌ప్పు – తగినన్ని
  • ఉల్లిపాయలు – రెండు
  • ప‌చ్చిమిర్చి – నాలుగు లేదా తగినన్ని
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర స్పూన్
  • ప‌చ్చి బఠాణీ – ఒక కప్పు
  • పుదీనా ఆకులు – అర క‌ప్పు
  • త‌రిగిన కొత్తిమీర – అర క‌ప్పు
  • ఉప్పు- త‌గినంత‌
  • గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్
  • బిర్యానీ ఆకులు – రెండు
  • జీరా – ఒక స్పూన్
  • యాలకులు – నాలుగు
  • ల‌వంగాలు – నాలుగు
  • దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌
  • అనాస‌పువ్వు – రెండు

పచ్చి బఠాణి పులావ్ తయారీ విధానం

ముందుగా బియ్యం కడిగి ఇరవై నిమిషాలపాటు నానబెట్టుకోవాలి. జీడిపప్పు దోరగా వేయించి పక్కనబెట్టుకోవాలి. ఉల్లిపాయాలను సన్నగాతరిగి అందులో సగం తీసుకుని ముదురు గోధుమ రంగులో వచ్చేలా వేయించి పక్కనబెట్టుకోవాలి. తర్వాత క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక దాల్చిన చెక్క,అనాసపువ్వు, బిర్యాని ఆకులు, జీరా, లవంగాలు, యాలకులు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించుకోవాలి.

మసాలా దినుసులు వేగిన త‌రువాత మిగిలిన ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, జీడిప‌ప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత అందులో అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌చ్చి బ‌ఠాణీ, పుదీనా ఆకులు, కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఓ ఐదు నిముషాలు వేయించుకోవాలి.

ఐదు నిముషాలు త‌రువాత సరిపడా ఉప్పు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. అనంతరం నాన‌బెట్టుకున్న బియ్యం, సరిపడా నీళ్లు పోసి క‌ల‌పాలి. మొత్తం క‌లిసేలా ఒకసారి క‌లిపిన త‌రువాత మూత పెట్టి మీడియం మంట‌పై నీరు ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించాలి. నీరు ద‌గ్గ‌రగా అయిన త‌రువాత లో ఫ్లేమ్ లో ఓ పది నిమిషాలపాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

చివరగా పైన కొద్దిగా నెయ్యి అలాగే ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ మిశ్రమం, కొత్తిమీర అలంకరించుకుంటే సరిపవుతుంది. అంతే ఘుమఘుమలాడే పచ్చి బఠాణి పులావ్ రెసిపీ రెడీ అయినట్లే.

పచ్చి బఠాణి పులావ్‌లో లభించే పోషకాలు, ప్రయోజనాలు

పచ్చి బఠానీలలో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు ఉప్పు తక్కువగా ఉంటాయి. అవి విటమిన్ A, విటమిన్ B6, ఫోలేట్ మరియు మెగ్నీషియంతో సహా ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాలకు మంచి మూలం. అవి ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, థయామిన్ మరియు మాంగనీస్ యొక్క అద్భుతమైన మూలం.

బఠానీలు ఆరోగ్యకరమైన చర్మం, ఎముకలు మరియు కళ్ళకు అవసరమైన బీటా కెరోటిన్ (విటమిన్ A) యొక్క అద్భుతమైన మూలాన్ని అందిస్తాయి . బఠానీలు విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలాన్ని అందిస్తాయి, ఇది మన చిగుళ్ళు, దంతాలు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

బఠానీలు థయామిన్ మరియు నియాసిన్ యొక్క మంచి మూలం. పీచు మరియు ప్రొటీన్‌లతో పాటు, బఠానీలు 100gకి 1.5 మరియు 1.9mg ఇనుమును కలిగి ఉంటాయి. ఇంకా, బఠానీలు ముఖ్యంగా ఫైటిక్ యాసిడ్‌ను సమతుల్యం చేయడంలో మంచివి, ఇది ఐరన్ శోషణను తగ్గిస్తుంది, విటమిన్ సితో ఇనుము శోషణను పెంచుతుంది.

నిజానికి పచ్చి బఠానీల నుండి వచ్చే ప్రధాన కేలరీలు దాని ఫైబర్ (కార్బోహైడ్రేట్) కంటెంట్ నుండి వస్తాయి మరియు బఠానీలలోని ఫైబర్ కరగని రకాలు అంటే ఇది మన కడుపులో స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది మరియు మన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇంకా, అవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటాయి, ఇది రక్తంలో చక్కెర స్పైక్‌లను నిరోధించడంలో సహాయపడుతుంది.

Post Comment