క్యాప్సికమ్ టమాటో కర్రీ రెసిపీ తయారీ విధానం : పోషకాలు
భారతీయ వంటకాలు

క్యాప్సికమ్ టమాటో కర్రీ రెసిపీ తయారీ విధానం : పోషకాలు

ఈ ఆర్టికల్ యందు టేస్టీ టేస్టీగా క్యాప్సికమ్ మరియు టమాటో కాంబినేషన్లో చేసే క్యాప్సికమ్ కర్రీ రెసిపీ తయారీ విధానం, కర్రీ తయారీకి కావాల్సిన పదర్ధాలు గూర్చి తెలుసుకుందాం. మీరు నేర్చుకుని ట్రై చేసి రుచి చూడండి

క్యాప్సికమ్ టమాటో కర్రీకి కావాల్సిన పదార్దాలు

  • క్యాప్సికమ్ - నాలుగు
  • ట‌మాట -  రెండు
  • ఆవాలు  - అర స్పూన్
  • బిర్యానీ ఆకు -ఒకటి
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
  • ధ‌నియాల పొడి - ఒక స్పూన్
  • జీల‌క‌ర్ర - అర స్పూన్
  • గ‌రం మ‌సాలా - ఒక స్పూన్
  • ఉప్పు - త‌గినంత‌
  • కారం - ఒక స్పూన్
  • ప‌సుపు - పావు టీ స్పూన్
  • నూనె – 2 టేబుల్ స్పూన్స్
  • ఉల్లిపాయ - రెండు
  • ప‌చ్చిమిర్చి - రెండు
  • క‌రివేపాకు - కొద్దిగా
  • కొత్తిమీర - కొద్దిగా.
  • ప‌ల్లీలు - రెండు టేబుల్ స్పూన్స్
  • పచ్చి కొబ్బరి - చిన్న ముక్క

క్యాప్సికమ్ టమాటో కర్రీ తయారీ విధానం

ముందుగా ఒక క‌ళాయిలో వేరుశనగ పలుకులు వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. తరవాత అదే కళాయిలో కొద్దిగా నూనె వేసి కొబ్బరి ముక్కలు, పచ్చి మిర్చి వేసి దోరగా వేయించుకుని చల్లర్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించిన పలుకులు, పచ్చి మిర్చి, కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి.

ఇప్పుడు అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బిర్యానీ ఆకు, ఆవాలు, జీల‌క‌ర్ర , కరివేపాకు వేసి వేయిచాలి. ఇవి వేగిన త‌రువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి.

టమాటో మగ్గిన త‌రువాత క్యాప్సికం ముక్క‌ల‌ను కూడా వేసి ఓ ఐదు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న పల్లి, కొబ్బరి పేస్ట్, కొద్దిగా ప‌సుపు, సరిపడా ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా పొడి కూడా వేసి కలుపుకోవాలి.

తరవాత ఒక గ్లాస్ నీటిని పోసి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి. చివర్లో కొత్తిమీర‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ క్యాప్సికం టమాటా మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, బిర్యానీ, రోటి,పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

క్యాప్సికమ్ టమాటో కర్రీలో లభించే పోషకాలు

క్యాప్సికమ్ 94%  వరకు నీరు, 5% కార్బోహైడ్రేట్లు, అలాగే చాలా తక్కువ మొత్తంలో ప్రోటీన్ మరియు కొవ్వు పదార్దాలు ఉంటాయి. క్యాప్సికమ్ లో ఇంకా విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి2, బి6, ఇ, నియాసిన్, ఫోలేట్ మరియు రిబోఫ్లేవిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

క్యాప్సికమ్ విటమిన్ B6 మరియు మెగ్నీషియం యొక్క మంచి మూలం , ఈ రెండూ నాడీ వ్యవస్థ యొక్క సాధారణ పనితీరును నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. క్యాప్సికమ్‌లోని మెగ్నీషియం ఆందోళన వల్ల కలిగే కండరాల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

క్యాప్సికమ్‌లో ఎక్కువగా కనిపించే కొన్ని పోషకాలు విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి6 మరియు ఫోలేట్. . రెడ్ క్యాప్సికమ్ ప్రపంచంలో అత్యంత విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలలో ఒకటి. కేవలం 100గ్రా మీ రోజువారీ సిఫార్సు చేసిన తీసుకోవడంలో 213% ఇస్తుంది.

టొమాటోలో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు విటమిన్ సి మరియు పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి . అవి యాంటీఆక్సిడెంట్‌లలో కూడా పుష్కలంగా ఉన్నాయి - టొమాటోల లక్షణ రంగుకు కారణమైన లైకోపీన్ అని పిలువబడే ఒకటి, గుండె జబ్బులు మరియు కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది.

Post Comment