ఉసిరికాయ పచ్చడి తయారు చేసే విధానం : పోషక విలువలు
భారతీయ వంటకాలు

ఉసిరికాయ పచ్చడి తయారు చేసే విధానం : పోషక విలువలు

ఉసిరికాయ మంచి పోషకాహారం ఆహారం. ఉసిరికాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిఉంటాయి.ఈ రోజు విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరికాయతో పచ్చడి తయారీ విధానం గూర్చి ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం.

ఉసిరికాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • ఉసిరికాయలు - అర కేజీ
  • జీలకర్ర - ఒక టీ స్పూన్
  • శనగపప్పు -  స్పూన్
  • మినప్పప్పు - ఒక టీ స్పూన్
  • ఆవాలు - రెండు టీ స్పూన్
  • మెంతులు - రెండు టీ స్పూన్స్
  • వెల్లుల్లిపాయలు - రెండు
  • ఎండుమిరపకాయలు - ఎనిమిది
  • కారం - రుచికి సరిపడా
  • చింతపపండు - మూడు బొట్టలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - రుచికి సరిపడా
  • కరివేపాకు - రెండు రెమ్మలు

ఉసిరికాయ పచ్చడి తయారు చేసే విధానం

ముందుగా కళాయిలో నూనె వేయకుండా మెంతులను వేయించి చల్లారిన తరవాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అలాగే చింతపండు గోరువెచ్చని నీళ్లలో పది నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తరవాత దాన్ని చిన్న మంటపై ఉడికించాలి. చింతపండు రసం చిక్కగా అయ్యేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఉసిరికాయలు శుభ్రంగా కడిగి, తడిలేకుండా పొడిగుడ్డతో తుడుచుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడయ్యాక ఉసిరికాయ ముక్కలను గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి, తీసి పక్కనపెట్టి చల్లారనివ్వాలి. తర్వాత దీంట్లో ఉడికించిన చింతపండు పేస్ట్, సరిపడా ఉప్పు, కారం, మెంతి పొడి , వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలపాలి.

అలా కలిపిన తర్వాత, పోపు కోసం పాన్‌లో నూనె వేసి, నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శెనగపప్పు వేసి వేయించాలి, ఇవి వేగాక ఎండుమిర్చిని వేసి రెండు నిముషాలు వేగనివ్వాలి. పోపు సరిగ్గా వేగాక ముందుగా కలిపి పెట్టుకున్న ఉసిరికాయలు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే యమ్మీ యమ్మీ ఉసిరికాయ పచ్చడి తయారు అయినట్లే. పచ్చడి చల్లారాక జాడీలో భద్రపర్చుకోవాలి.

ఉసిరికాయ పచ్చడిలో పోషక విలువలు

ఉసిరికాయ పచ్చడి ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహార పదార్ధాలలో ఒకటి. ఉసిరిలో విటమిన్ సి కంటెంట్‌తో సమృద్ధిగా ఉంటుంది, ఇది మొత్తం ఆరోగ్య మెరుగుదలకు చాలా ముఖ్యమైన పోషక పదార్ధం.

ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా పచ్చడిలో 23 కేలరీలను ఇస్తుంది . వీటిలో కార్బోహైడ్రేట్లు 7 కేలరీలు, ప్రోటీన్లు 1 కేలరీలు మరియు మిగిలిన కేలరీలు 16 కేలరీలు కొవ్వు నుండి వస్తాయి. ఉసిరి ఊరగాయ మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది, ఇది మీకు బరువు తగ్గడంలో సహాయపడుతుంది , మీ కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది.

100 గ్రాముల ఉసిరిలో 300 mg విటమిన్ సి, డైటరీ ఫైబర్, కాల్షియం, ఐరన్ మరియు పాలీఫెనాల్స్, ఆల్కలాయిడ్స్ మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. రోజూ ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, వయస్సు సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు విటమిన్ ఎ ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడటంలో సహాయపడుతుంది.

ఆమ్లా పచ్చడిలో విటమిన్ సి, థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బి-6, విటమిన్ బి-12, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి మరియు విటమిన్ కె వంటి విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి . ఆరోగ్య ప్రయోజనాలు - ప్రోబయోటిక్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్ల యొక్క విపరీతమైన మూలంగా పరిగణించబడుతున్న మధుమేహ నియంత్రణ మరియు మెరుగైన జీర్ణక్రియకు దోహదం చేస్తాయి.

Post Comment