క్యాబేజి ఫ్రైడ్ రైస్ తయారీ విధానం : పోషకాలు, ప్రయోజనాలు
భారతీయ వంటకాలు

క్యాబేజి ఫ్రైడ్ రైస్ తయారీ విధానం : పోషకాలు, ప్రయోజనాలు

రైస్ కాంబినేషన్లో చేసే ప్రతీ రెసిపీకి ఒక ప్రత్యేక రుచి కలిగి ఉంటుంది. ఈ ఆర్టికల్ యందు క్యాబేజి మరియు రైస్ కాంబినేషన్లో చేసే క్యాబేజి ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలి, ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్ధాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. మీరు కూడా నేర్చుకుని ఒక్కసారి ట్రై చేయండి.

క్యాబేజి ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్దాలు

  • బాస్మ‌తీ బియ్యం - రెండు కప్పులు
  • క్యాబేజ్ తురుము– ఒక‌ క‌ప్పు
  • క్యారెట్ – ఒకటి
  • బీన్స్ – పిడికెడు
  • నూనె – నాలుగు స్పూన్స్
  • ప‌చ్చిమిర్చి – రెండు
  • వెల్లుల్లి త‌రుగు – ఒక టీ స్పూన్
  • అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్
  • జీరా - అర స్పూన్
  • ఉల్లిపాయ – ఒకటి
  • ఉప్పు – త‌గినంత‌
  • కారం – అర‌ టీ స్పూన్
  • సోయా సాస్ – ఒక టీ స్పూన్
  • వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్,
  • మిరియాల పొడి – అర టీ స్పూన్
  • ధనియాలపొడి - అర స్పూన్
  • కొత్తిమీర – కొద్దిగా

క్యాబేజి ఫ్రైడ్ రైస్ తయారీవిధానం

ముందుగా రైస్ కడిగి కొంచెం పలుకుగా ఉడికించి పక్కనబెట్టి చల్లార్చుకోవాలి. క్యారెట్, క్యాబేజి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడ‌ల్పుగా ఉండే ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక అల్లం త‌రుగు, వెల్లుల్లి త‌రుగు,మీర్ జీరా, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి మీడియం మంటపై బాగా వేయించుకోవాలి. త‌రువాత అందులో ముందుగా తరిగిన క్యారెట్, బీన్స్, క్యాబేజ్ తురుము వేసి కొంచెం పెద్ద మంటపై వేయించుకోవాలి.

బాగా వేయించిన తరవాత అందులోకి ముందుగా వండుకున్న అన్నం, సరిపడా ఉప్పు, ధనియాలపొడి, కొద్దిగా కారం, సోయా సాస్, వెనిగ‌ర్, మిరియాల పొడి వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ ను ఐదు నిమిషాల పాటు బాగా క‌లుపుతూ వేయించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీగా ఉండే వెజ్ ఫ్రైడ్ రైస్ త‌యార‌వుతుంది. దీనిని పెరుగు చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

క్యాబేజి ఫ్రైడ్ రైస్‌లో లభించే పోషకాలు, ప్రయోజనాలు

క్యాబేజీ అత్యంత పోషకమైనది మరియు విటమిన్ సి, ఫైబర్ మరియు విటమిన్ K లతో సమృద్ధిగా ఉంటుంది. క్యాబేజీ మరియు బియ్యంలో ఫైబర్ సంవృద్ధిగా లభిస్తుంది. ఫైబర్ జీనక్రియను మెరుగుపరచటానికి మరియు ప్రేగు ఆరోగ్యానికి పెంపొందించటానికి ఉపయోగపడుతుంది. క్యాబేజీలోని యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైబర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు.

క్యాబేజీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడతాయి. అలాగే విటమిన్ కె ఎముకుల ఆరోగ్యానికి మరియు రక్తం గడ్డకట్టడానికి చాలా అవసరం. క్యాబేజీలో కేలరీలు తక్కువుగా ఉంటాయి. క్యాబేజీ ఫ్రైడ్ రైస్ సాపేక్షంగా తక్కువ కేలరీల వంటకం, బరువు నిర్వహణకు ఇది మంచి ఆహార ఎంపిక .

Post Comment