మునక్కాయ మసాలా కర్రీ తయారీ విధానం : పోషకాలు
భారతీయ వంటకాలు

మునక్కాయ మసాలా కర్రీ తయారీ విధానం : పోషకాలు

ఈ ఆర్టికల్ యందు టేస్టీ టేస్టీగా మునక్కాయ మరియు టమాటో కాంబినేషన్లో చేసే మునక్కాయ కర్రీ రెసిపీ తయారీ విధానం, కర్రీ తయారీకి కావాల్సిన పదర్ధాలు గూర్చి తెలుసుకుందాం. మీరు నేర్చుకుని ట్రై చేసి రుచి చూడండి.

మునక్కాయ కర్రీకి కావాల్సిన పదార్దాలు

  • మునక్కాయలు - నాలుగు
  • ట‌మాట – ఒకటి
  • పచ్చి మిర్చి - రెండు
  • నూనె – రెండు నుంచి నాలుగు టీ స్పూన్స్
  • కారం – ఒక స్పూన్
  • ధ‌నియాల పొడి – ఒక స్పూన్
  • ఆవాలు – అర స్పూన్
  • జీల‌కర్ర – అర స్పూన్
  • క‌రివేపాకు – ఒక రెమ్మ‌
  • ఉల్లిపాయ – ఒకటి
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
  • ప‌సుపు – పావు స్పూన్
  • ఉప్పు – త‌గినంత‌
  • కొత్తిమీర – కొద్దిగా
  • ప‌ల్లీలు – రెండు టేబుల్ స్పూన్స్
  • దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌
  • ల‌వంగాలు – రెండు
  • యాల‌కులు – రెండు
  • ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – రెండు స్పూన్స్
  • మిరియాల పొడి - ఆర స్పూన్
  • చింత‌పండు – ఒక బొట్ట

మునక్కాయ కర్రీ తయారీ విధానం

ముందుగా మునక్కాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన త‌రువాత దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు, చింతపండు వేసి టమాటా మెత్తబడే వరకు వేయించుకోవాలి.

పై రెండు మిశ్రమాలు చల్లారాక ఒక మిక్సీజార్ తీసుకుని అందులో వేసి, విడివిడిగా పేస్ట్ లా చేసుకుని పక్కనబెట్టుకోవాలి. తరవాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక మున‌క్కాయ ముక్క‌లు వేసి ఐదు నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌రకు వేయించుకోవాలి.

తర్వాత ముందుగా రుబ్బుకున్న ట‌మాటా, ఉల్లి పేస్ట్, అలాగే మసాలా పేస్ట్, ధనియాల పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు, ప‌సుపు, కారం వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. తరవాత మునక్కాయ ముక్కలు వేసుకుని, గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. కూర ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రుచిగా ఉండే మున‌క్కాయ క‌ర్రీ రెడీ అయినట్లే.

మునక్కాయ కర్రీలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

మునగకాయలలో విటమిన్లు ఎ, సి, కె, బి మరియు ఐరన్, కాల్షియం మరియు మెగ్నీషియం, పాస్పరస్, ఫైబర్ మరియు ప్రోటీన్ వంటి పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి. మునగ కాయ ముఖ్యమైన మినరల్ కాల్షియం, ఐరన్ మరియు ఫాస్పరస్ యొక్క అద్భుతమైన మూలం, పెరుగుతున్న పిల్లలలో ఎముకలను బలపరుస్తుంది. ఆహారంలో మునగకాయను క్రమం తప్పకుండా చేర్చడం వల్ల వృద్ధులలో ఎముకల సాంద్రతను పునరుద్ధరిస్తుంది మరియు బోలు ఎముకల వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది.

మునక్కాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మునగకాయలు ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి. మునగ కాయలు రక్త శుద్ధికి తోడ్పడతాయి.శ్వాసకోశ వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతాయి.మధుమేహాన్ని నియంత్రించడంలో మరియు అధిక రక్తపోటు ఎముకలను బలపరుస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అంగస్తంభనకు చికిత్స చేస్తుంది మరియు లిబిడోను పెంచుతుంది.

Post Comment