సంక్రాంతి స్పషల్ అరిసెలు తయారీ విధానం : బెల్లం అరిసెలు
భారతీయ వంటకాలు

సంక్రాంతి స్పషల్ అరిసెలు తయారీ విధానం : బెల్లం అరిసెలు

సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాలలో పిండి వంటల వాసనలు ప్రతీ ఇంట్లో ఘుమఘుమలాడుతూ ఉంటాయి. ఈ ఆర్టికల్ యందు సంక్రాంతి స్పషల్ వంటకం అయిన అరిసెలు తయారీ విధానం గూర్చి తెలుసుకుందాం.

అరిసెలు తయారీకి కావాల్సిన పదార్దాలు

  • రేషన్ బియ్యం - మూడు కప్పులు
  • బెల్లం - మూడు కప్పులు
  • చక్కర -2 టేబుల్ స్పూన్లు
  • నెయ్యి - కొద్దిగా
  • నువ్వులు - అర కప్పు
  • నూనే - వేయించటానికి సరిపడా

అరిసెలు తయారీ విధానం

ముందుగా బియ్యం శుభ్రం చేసుకోవాలి. తరవాత బియ్యంలో నీళ్ళుపోసి ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి. లేదా ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. మరుసటిరోజు ఆ బియ్యం కడిగి రోట్లో మెత్తని పిండిగా దంచుకోవాలి,లేదా మిక్సీ పట్టి పిండి తీసుకోవాలి. ఇపుడు స్టౌవ్ మీద దళసరి కళాయి పెట్టి దానిలో మెత్తని బెల్లం, పంచదార వేసుకుని బెల్లం మునిగేలా నీరు పోసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకుని. మెల్లగా గరిటెతో తిప్పుతూ లో- ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి.

బెల్లం పాకం అరిసెలకు సరిపడినట్లు వచ్చిందో లేదో చెక్ చేయడానికి ఒక చిన్న పళ్ళెంలో నీరు తీసుకుని అందులో ఈ బెల్లం పాకం కొంచెం వేసుకుని ఉండ కట్టండి. అప్పుడు స్మూత్ గా మరీ గట్టిగా కాకుండా ఉండేలా పాకం వచ్చిన తర్వాత, అందులో కొంచెం నువ్వులు వేసుకోవాలి. అనంతరం స్టౌవ్ ని లో- ఫ్లేమ్ లో పెట్టి, ఆ పాకంలో ముందుగా సిద్ధం చేసుకున్న తడి బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలపాలి.

అలా కలిపిన తర్వాత ఇప్పుడు అరిసెలు తయారీకి చలిమిడి రెడీ అవుతుంది. స్టౌవ్ మీద బాణలి పెట్టి, వేయించటానికి సరిపడా నూనే వేసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని, ఒక పాలితిన్ కవర్ పైన మీకు కావలిసిన సైజులో అద్దుకోవాలి. ఇలా అద్దుకున్న అరిసెలను వేడి నూనెలో వేసుకుని మీడియంలో మంటపై వేయించాలి. రెండు వైపులా గోల్డె కలర్ వచేవరకూ వేయించుకోవాలి. అంతే ఆంధ్ర స్పెషల్ రుచికరమైన అరిసెలు రెడీ.

అరిసెలు తయారీకి కొన్ని చిట్కాలు

సాధారణంగా పిండి వంటలకు రేషన్ బియ్యం మాత్రమే ఉపయోగించాలి. బెల్లం నాణ్యమైనది తీసుకోవాలి. అరిసెలు తయారీకి బెల్లం పాకం ప్రదానం కనుక మంచి బెల్లం తీసుకోవాలి. బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. ఇది గ్రైండ్ చేయడం సులభం అవుతుంది మరియు అరిసెలు వేయించేటప్పుడు ఉబ్బడానికి కూడా సహాయపడుతుంది. బియ్యం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొట్టుతీసిన నువ్వులు ఉపయోగించాలి. అరిసెలు సువాసన కావాలనుకుంటే మలచి పొడి వేసుకోవచ్చు. అరిసెలు రెండు వైపులు బాగా వేగనివ్వాలి.

అరిసెలులో లభించే పోషకాలు, ప్రయోజనాలు

బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఐరన్ శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అలాగే ఐరన్ అలసట మరియు రక్తహీనతను కూడా నివారిస్తుంది. అరిసెలులో రక్తపోటును నియంత్రించే మరియు హిమోగ్లోబిన్‌ను పెంచడానికి సహాయపడే పోషకాలను కూడా కలిగి ఉంటుంది. ఇందులో మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది.

నువ్వులు ఎముకల ఆరోగ్యం, చర్మ ఆకృతి, ఒత్తిడి స్థాయిలు మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతమైనవి. అరిసెలు కాల్షియం యొక్క మంచి మూలం. బలమైన ఎముకలను నిర్మించడానికి మరియు నిర్వహించడానికి కాల్షియం ముఖ్యమైనది.

అరిసెలు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్, గుండె జబ్బులు మరియు స్ట్రోక్‌తో సహా అనేక దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్నాయి .

అరిసెలు విటమిన్లు మరియు ఖనిజాలకు మంచి మూలం. అరిసెలు విటమిన్ B6, విటమిన్ B12, పొటాషియం మరియు మెగ్నీషియంతో సహా మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైన వివిధ రకాల విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంది

Post Comment