కాలీఫ్లవర్ పులావ్ తయారీ విధానం : గోబీ పులావ్ రెసిపీ
భారతీయ వంటకాలు

కాలీఫ్లవర్ పులావ్ తయారీ విధానం : గోబీ పులావ్ రెసిపీ

రైస్ కాంబినేషన్లో చేసే ఒక్కో రెసిపీ ఒక ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. ఈ ఆర్టికల్ యందు కాలీఫ్లవర్ మరియు రైస్ కాంబినేషన్లో చేసే కాలిఫ్లవర్ పులావ్  రెసిపీ ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్ధాలు ఇక్కడ తెలుసుకుందాం. కాలిఫ్లవర్ పులావ్ లో పోషకాలు సంవృద్ధిగా లభిస్తాయి, మీరు కూడా నేర్చుకుని ట్రై చేయండి.

కాలీఫ్లవర్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్ధాలు

  • బాస్మతి రైస్ - రెండు కప్పులు
  • కాలిఫ్లవర్ - రెండు కప్పులు
  • క్యారెట్ - ఒకటి
  • బఠాణీలు - పావు కప్పు
  • టమాటా - ఒకటి
  • ఉల్లిపాయలు - రెండు
  • పచ్చి మిర్చి - నాలుగు
  • కారం - సరిపడా
  • పసుపు - పావు టీ స్పూన్
  • జీలకర్ర - ఆఫ్ టీ స్పూన్
  • గరం మసాలా - ఆఫ్ టీ స్పూన్
  • దాల్చిన చెక్క - చిన్న ముక్క
  • లవంగాలు - రెండు
  • యాలకులు - రెండు
  • బిర్యానీ ఆకులు - రెండు
  • మిరియాలు పొడి - పావు టీ స్పూన్
  • ఉప్పు - సరిపడా
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  • నూనె - రెండు స్పూన్స్
  • నెయ్యి - రెండు స్పూన్స్
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • నీళ్లు నాలుగు కప్పులు

కాలీఫ్లవర్ పులావ్ తయారు చేయు విధానం

ముందుగా బియ్యంను శుభ్రంగా కడిగి ఇరవై నిమిషాలపాటూ నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి సగం ముక్కలను డెకరేషన్ కోసం వేయించుకుని పక్కనబెట్టుకోవాలి. అలాగే కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా విడదీసి గోరువెచ్చని నీళ్లలో కడిగి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత మందంగా ఉన్న పాన్ స్టౌమీద పెట్టి, అందులో నూనె వేసి, నూనె వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, మిరియాల పొడి, దాల్చిన చెక్క, యాలకులు, యాలకులు వేసి ఒక నిమిషం వేయించాలి. ఇప్పుడు అందులో వేయించగా మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బ్రౌన్ కలర్ వచ్చాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలా రెండు నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

అనంతరం అందులో కాలీఫ్లవర్, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు మరియు పచ్చిబటానీ, పచ్చిమిర్చిలను వేసి ఐదు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఐదునిమిషాలు తరవాత అందులో టమోటో, కొద్దిగా పసుపు, సరిపడా కారం, గరం మసాలా వేసి మరో ఐదు నిముషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అందులో నానబెట్టిన బాస్మతి రైస్, సరిపడా ఉప్పు కూడా వేసి, కలుపుతూ రెండు నిముషాలు వేయించాలి.

ఇప్పుడు అందులో సరిపడా నీళ్ళు పోసి బాగా కలిపి, పాన్ పై మూత పెట్టి పది నిముషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. నీరు దగ్గరగా అయిన తర్వాత మంట తగ్గించుకుని మరో ఐదు నిముషాలు మగ్గించాలి. చివర్లో స్టవ్ ఆఫ్ చేసుకుని పైన కొత్తిమీర తరుగు, నెయ్యి, ముందుగా వేయించిన ఉల్లి తరుగు వేసి అలంకరించుకోవాలి. అంతే వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే.

కాలీఫ్లవర్ పులావ్‌లో లభించే పోషకాలు

కాలీఫ్లవర్లో ఫైబర్ సంవృద్ధిగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను క్రమబద్ధీకరించడానికి, మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగించడానికి మరియు బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్ విటమిన్లు సి, కె మరియు బి6 పుష్కలంగా ఉంటాయి.

విటమిన్ సి అనేది యాంటీఆక్సిడెంట్, ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్తం గడ్డకట్టడానికి విటమిన్ కె ముఖ్యమైనది. విటమిన్ B6 మెదడు పనితీరు మరియు జీవక్రియకు ముఖ్యమైనది. కాలీఫ్లవర్ కొవ్వు రహిత మరియు కొలెస్ట్రాల్ లేనిది. మరియు ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది.

కాలీఫ్లవర్ లో పొటాషియం, ఫాస్పరస్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు కూడా లభిస్తాయి . ఇవి కండరాలు మరియు నరాల పనితీరుకు పొటాషియం ముఖ్యమైనది. ఎముకల ఆరోగ్యానికి భాస్వరం ముఖ్యం. శక్తి ఉత్పత్తి మరియు కండరాల పనితీరుకు మెగ్నీషియం ముఖ్యమైనది. కాలీఫ్లవర్ గ్లూకోరాఫానిన్‌ను కలిగి ఉంటుంది మరియు చర్మపు పిగ్మెంటేషన్ సమస్యలలో సహాయపడుతుంది మరియు సూర్యరశ్మి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని ఉపశమనం చేస్తుంది.

Post Comment