ఉల్లిపాయ పకోడి తయారు విధానం : ఉల్లిపాయ పకోడి రెసిపీ
భారతీయ వంటకాలు

ఉల్లిపాయ పకోడి తయారు విధానం : ఉల్లిపాయ పకోడి రెసిపీ

రోజూ సాయంత్రం పూట బయట దొరికే ఒకే రకమైన స్నాక్స్ తిని విసుగుపుడుతోందా.. అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీ కోసమే, ఎంచక్కా ఇంట్లోనే అదిరిపోయే ఉల్లిపాయ పకోడీ ఎలా తయారుచేయాలి, తయారీకి కావలసిన పదార్దాలు ఏమిటో ఈ ఆర్టికల్ యందు తెలుసుకుందాం.

ఉల్లిపాయ పకోడీ తయారీకి కావలిసిన పదార్దాలు

  • ఉల్లిపాయ – ఆరు
  • శనగపిండి - రెండు కప్పులు
  • పచ్చిమిర్చి - ఆరు
  • జీలకర్ర - అర స్పూన్
  • కొత్తిమీర - రెండు రెమ్మలు
  • కరివేపాకు - రెండురెమ్మలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • బేకింగ్ సోడా - చిటికెడు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
  • నీళ్లు - తగినన్ని
  • కారం - సరిపడా
  • నూనె వేయించడానికి సరిపడా

ఉల్లిపాయ పకోడీ తయారీ విధానం

ముందుగా ఉల్లిపాయలు సన్నగా, నిలువుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఉల్లిపాయ ముక్కలు తీసుకొని కొంచెం ఉప్పు వేసి వాటిని నలపాలి. అనంతరం శనగ పిండి, జీలకర్ర, కొత్తిమీర తురుము, పచ్చి మిర్చి తురుము, కరివేపాకులు చిన్నగా కత్తిరించి వేసుకోవాలి. తరవాత ఈ మిశ్రమంలోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా, కారం వేసి కొద్దికొద్దిగా నీళ్లు వేస్తూ కొద్దిగా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. అపుడే పకోడీలు క్రిస్పీగాఉంటాయి.

ఈ విధంగా పకోడీకి మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసి పాన్‌లో పకోడీ వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత శనగపిండి మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని చిన్న చిన్నగా నూనెలో వేసుకుంటూ బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంతే టేస్టీగా మరియు క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అయినట్లే. ఈ విధంగా వేయించుకున్న పకోడీలను వేడివేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.

ఉల్లిపాయ పకోడీలో లభించే పోషకాలు, ప్రయోజనాలు

ఉల్లిపాయలలో తగిన మొత్తంలో విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ B6 మరియు పొటాషియం ఉన్నాయి, ఇవి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఉల్లిపాయలు యాంటీఆక్సిడెంట్లు మరియు సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి మంటతో పోరాడడం ద్వారా మరియు ట్రైగ్లిజరైడ్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి .

ఉల్లిపాయలలో పెద్ద మొత్తంలో క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీని కలిగి ఉంటాయి, ఇవి అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. పచ్చి ఉల్లిపాయలు విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం, ఇది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హృదయనాళ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. జీర్ణక్రియకు సహకరిస్తుంది. వాపును తగ్గిస్తుంది అలాగే ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు మెదడు పనితీరును పెంచుతుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది మరియు చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

Post Comment